Home » AP Assembly Sessions
గత ప్రభుత్వం అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని... దీని వల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని నజీర్ తెలిపారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్ నుంచి మంత్రి లోకేష్ బయటకు వస్తున్న సమయంలో లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్ హడావుడి చేశారు.
జీఎస్టీ సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జిల్లా నుంచి గ్రామస్ధాయి వరకూ ఏఏ బెనిఫిట్స్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అమలు అవుతాయో తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే విధంగా పలు అంశాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
50 ఏళ్లకే ఫించన్ అన్నారని.. అదే అడిగితే దానికి సమాధానం లేదని బొత్స అన్నారు. ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెప్తున్నారని మండిపడ్డారు.
పెన్షన్‌లను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసినా, ఆ తర్వాత నాలుగు వేలు చేసినా, 15 వేల వరకు పెన్షన్ అందిస్తోన్న ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అని మంత్రి కొండపల్లి చెప్పుకొచ్చారు.
భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి అనగాని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగావకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయన్నారు.
సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు.
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.