-
-
Home » Andhra Pradesh » ap assembly monsoon session government bills discussions live updates in telugu news siva
-
AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్ ఆగ్రహం
ABN , First Publish Date - Sep 18 , 2025 | 09:33 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే విధంగా పలు అంశాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
Live News & Update
-
Sep 18, 2025 17:09 IST
జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుంది: చంద్రబాబు
గతంలో జీఎస్టీ, వ్యాట్ వంటి పన్నుల విధానం ఉండేది: చంద్రబాబు
గతంలో 17 రకాల పన్నుల, 13 రకాల సర్‌ఛార్జ్‌లు ఉండేవి: చంద్రబాబు
వాజ్‌పేయీ హయాంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చారు
అందరినీ ఒప్పించి అరుణ్‌జైట్లీ జీఎస్టీ సంస్కరణలను అమలు చేశారు
జీఎస్టీ అమలు.. గేమ్ ఛేంజర్‌గా మారింది: సీఎం చంద్రబాబు
జీఎస్టీ రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చారు: చంద్రబాబు
సంస్కరణలకు నేను ఎప్పుడూ ముందుంటా: చంద్రబాబు
అభివృద్ధి జరిగితే సంపద సృష్టి.. ప్రభుత్వానికి ఆదాయం: చంద్రబాబు
ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది
సంపద సృష్టించనివారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు: చంద్రబాబు
అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది నా నమ్మకం: సీఎం చంద్రబాబు
ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. దేశం, రాష్ట్రమే ముఖ్యం: సీఎం చంద్రబాబు
దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చూడాలి: చంద్రబాబు
గతంలో 4 టైర్ (5, 12, 18, 28 శాతం) పన్నుల వ్యవస్థ ఉండేది: చంద్రబాబు
ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారు: చంద్రబాబు
పన్నుల విధానంలో 2 శ్లాబులు (5, 18 శాతం) ఉంచి సరళతరం చేశారు
ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం: చంద్రబాబు
మోదీ సంస్కరణలతో పరోక్షపన్ను చెల్లింపుదారులు 132 శాతం పెరిగారు
2017లో 65 లక్షల మంది ఉంటే.. ప్రస్తుతం 1.51 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు: చంద్రబాబు
-
Sep 18, 2025 17:09 IST
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయి: పవన్‌కల్యాణ్
జీఎస్టీ సంస్కరణల్లో ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా
సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం
రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా..
సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం: పవన్‌కల్యాణ్
చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపి తొలి రాష్ట్రం ఏపీ: పవన్‌కల్యాణ్
-
Sep 18, 2025 14:46 IST
ఏపీ అసెంబ్లీ: GST శ్లాబ్స్ తగ్గింపుపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన
తక్కువ ఆదాయాల కుటుంబాల అవసరాల కోసం పన్ను తగ్గించారు.
నిత్యావసరాలపై 5 నుంచి సున్నా శాతం పన్ను తగ్గింపు: పయ్యావుల
నెయ్యి, వెన్న, వంటపాత్రలపై 12 నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు: పయ్యావుల
GST సంస్కరణల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: పయ్యావుల
-
Sep 18, 2025 14:34 IST
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్ ఆగ్రహం
చాంబర్ నుంచి మంత్రి లోకేష్ బయటకు వస్తున్న సమయంలో..
లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్ హడావుడి
సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ మంత్రి లోకేష్ ఆగ్రహం
ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు
బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలి కానీ..
ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం వద్దని మార్షల్స్‌కు లోకేష్ హితవు
-
Sep 18, 2025 13:56 IST
ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
-
Sep 18, 2025 12:35 IST
అమరావతి: ఈ నెల 30 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
10 పనిదినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఎసీ నిర్ణయం.
సభలో చర్చించేందుకు 18అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం.
-
Sep 18, 2025 11:55 IST
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఎసీ) భేటీ
హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్న బీఎసీ.
-
Sep 18, 2025 10:41 IST
యూరియా, గిట్టుబాటు ధరలపై చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్న
ఎవరి హయాంలో ఏం చేశారనేది చర్చలో తేలుద్దాం: మంత్రి అచ్చెన్న
-
Sep 18, 2025 10:41 IST
టిడ్కో ఇళ్ల కేటాయింపులను గత ప్రభుత్వం తగ్గించింది: మంత్రి నారాయణ
కాంట్రాక్టర్లకు గత నాలుగు నెలల్లో రూ.280 కోట్లు చెల్లించాం: మంత్రి నారాయణ.
మొత్తం 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను మళ్ళీ ప్రారంభించాం: మంత్రి నారాయణ.
కాంట్రాక్టర్లకు రూ.3,664 కోట్ల బిల్లులు చెల్లించాలి: మంత్రి నారాయణ.
టిడ్కో ప్రాజెక్ట్ పూర్తికావాలంటే రూ.6 వేలకోట్లు అవసరం: మంత్రి నారాయణ.
-
Sep 18, 2025 10:34 IST
ఏపీ శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్
ఏపీలో రైతుల సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం
-
Sep 18, 2025 10:33 IST
ఏపీ అసెంబ్లీ: జీరో అవర్‌లో మంత్రులు అధికారులపై స్పీకర్ అసహనం
ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అధికారులు, మంత్రులు..
ఎవరూ నోట్ చేసుకోకపోవడమేంటని నిలదీసిన స్పీకర్ అయ్యన్న
సమాధానం ఇచ్చేలా మంత్రులు, అధికారులను ఆదేశించాలని కోరిన గోరంట్ల.
-
Sep 18, 2025 09:54 IST
నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిట్ చాట్.
గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.
కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు సమయానికి అందిస్తున్నారు.
దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది.
తల్లికి వందనం, శ్రీశక్తి పథకాలపై ప్రజల్లో స్పందన చాలా బాగుంది.
శ్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలులో తెలంగాణ, కర్ణాటకలో వచ్చిన సమస్యలను ఇక్కడ రాకుండా పరిష్కరించారు.
దీంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయింది.
అందువలనే పథకానికి మహిళలు నుంచి మంచి స్పందన వచ్చింది.
గత ప్రభుత్వ హయంలో ఆర్థిక విద్వంసం జరిగినా కూడా చంద్రబాబు వంటి పాలనా దక్షుడుకి అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేయడం సాధ్యమైంది.
-
Sep 18, 2025 09:49 IST
కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్: ఎంపీ అవినాష్‌రెడ్డి
ఏ ఒక్క పథకం అమలు కావడం లేదు: ఎంపీ అవినాష్‌రెడ్డి
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం అన్యాయం: అవినాష్
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా?: ఎంపీ అవినాష్‌రెడ్డి
ఏపీ శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: ఎంపీ అవినాష్‌రెడ్డి
ఏపీకి పవన్ కల్యాణ్ టూరిస్టులా వచ్చిపోతున్నారు: అవినాష్‌రెడ్డి
ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది
యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు: అవినాష్‌రెడ్డి
-
Sep 18, 2025 09:47 IST
విజయవాడ: పార్టీ MLAలు, MLCలతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశం
గత వైసీపీ పాలనలో కేంద్ర పథకాలను దారిమళ్లించారు: మాధవ్
శాసనసభ, శాసనమండలి పనిదినాలు పెంచాలి: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
-
Sep 18, 2025 09:47 IST
ఇప్పటికైనా జగన్ అసెంబ్లీకి రావాలి: MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తన అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు.
తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని జగన్ సొంత మీడియాతో మాట్లాడుతున్నారు.
పిరికి వ్యక్తి కాబట్టే ఇనుపకంచెతో నిర్మించిన ప్యాలెస్ నుంచి బయటకు రావట్లేదు.
ప్రతిపక్ష నేతగా జగన్ పనికిరారని ప్రజలు పక్కనపెట్టారు: బుచ్చయ్య చౌదరి.
-
Sep 18, 2025 09:33 IST
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.
కార్మిక, పరిశ్రమలు, మోటార్ వాహనాలు, ఎస్టీలకు సంబంధించి.. అసెంబ్లీలో 8 చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
అసెంబ్లీలో చర్చించేందుకు 22 అంశాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం.