Home » AP Assembly Sessions
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్‌లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖర్ రావులు అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్నది మాజీ సీఎం జగన్ రెడ్డి కోరిక అని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ కోరికకు అనుగుణంగా విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది.
ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..
ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.