AP Assembly: సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:12 AM
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కారయ్యింది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ గత నెలలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు అంశం పై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..