Share News

Raghurama Krishnam Raju: జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 14 , 2025 | 09:46 PM

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్నది మాజీ సీఎం జగన్ రెడ్డి కోరిక అని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ కోరికకు అనుగుణంగా విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

Raghurama Krishnam Raju: జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..
Raghurama Krishnam Raju

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ రెడ్డిపై వెంటనే చర్యలు ఉండవని తెలిపారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోయిన పక్షంలోనే సభ తీసుకునే నిర్ణయం మేరకు ఆయనపై చర్యలు ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన 37 రోజులు మాత్రమే హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. సభకు ఇన్ని రోజులు రాకపోతే రాజ్యాంగం నిబంధనల మేరకు అనర్హులు అవుతారని చెప్పవలసిన బాధ్యత తమ వ్యవస్థపై ఉందన్నారు. అందుకే గుర్తు చేస్తున్నామని చురకలు పెట్టారు.


అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్నది మాజీ సీఎం జగన్ రెడ్డి కోరిక అని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ కోరికకు అనుగుణంగా విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పదేపదే ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారని ఆరోపించారు. తాము కూడా నిబంధనలను ఉల్లంఘించడం కుదరదని పట్టుబట్టి ముందుకు వెళ్తున్నామని తేల్చి చెప్పారు. అయితే 60 రోజులపాటు అసెంబ్లీకి జగన్ రాకపోతే సభాధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..

Updated Date - Sep 14 , 2025 | 10:08 PM