Home » Andhrapradesh
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.
విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.
శుక్రవారం తెల్లవారుతుండగానే పిడుగులాంటి వార్తతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. నగరం నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Vemuri Kaveri Travels) బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురై.. 19 మంది సజీవ దహనమయ్యారు.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.