Share News

AP News: కుమారులు వివాహం చేసుకోవడం లేదని..

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:33 PM

కుమారులు వివాహం చేసుకోవడం లేదని.. మనస్థాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన భీమవరం పట్టణంలో జరిగింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

AP News: కుమారులు వివాహం చేసుకోవడం లేదని..

- మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

భీమవరం(అమరావతి): పెద్ద కుమారుడికి 30 ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోకపోవడంతో మనస్తాపంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమవరం(Bheemavaram)లో జరిగింది. భీమవరం వన్‌టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శేషావతారం తెలిపిన వివరాలివి.. కొన్నేళ్ళ క్రితం ఒక నేపాల్‌ దేశానికి చెందిన కుటుం బం భీమవరం వెంకయ్యనాయుడు వీధిలో నివశిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు. రెండేళ్ల క్రితం సహరి సుమిత్రాదేవి(57) భర్త చనిపోవడంతో ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్నారు.


ఇద్దరు కుమారులు హోటల్స్‌లో కుక్‌లుగా పని చేస్తుండగా చిన్న కుమారుడు స్టిక్కరింగ్‌ షాపులో పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి 30 ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోవడం లేదని పలుమార్లు చెప్పి చూసింది. సొంతిల్లు లేకుండా వివాహం చేసుకుని ఏం చేస్తామంటూ తల్లికి ఎదురు చెప్పేవాడు. ఈనెల 22న సుమిత్రాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. వెంటనే వాంతులు కావడంతో మిన్నకుండిపోయింది.


zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz.jpg

కుమారులకు విషయం చెప్పకపోవడంతో వారికీ విషయం తెలియదు. ఈక్రమంలో గురువారం సాయంత్రం నీరసంగా ఉందని తల్లి చెప్పడంతో కుమారులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యం పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. పెద్ద కుమారుడు సహరీ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుట హెచ్‌సీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..

3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2025 | 02:33 PM