Share News

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:03 PM

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్‌-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం కాకినాడ టౌన్‌-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ టౌన్‌-మైసూరు బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) జనవరి 16, 19, 23, 26, 30 తేదీల్లో (మంగళ, శుక్రవారాలలో), దీని తిరుగు ప్రయాణపు రైలు (07034) జనవరి 17, 20, 24, 27, 31 తేదీల్లో (మంగళ, శనివారాలలో) నడుపుతామన్నారు. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు,


pandu3.jpg

గుడివాడ, విజయవాడ, గుంటూరు(Guntur), సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నెలగొండ, సికింద్రాబాద్‌(Secundrabad), బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌(Lingampally, Vikarabad), తాండూరు, సేడం, యాదగిరి, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యల్హంక, బెంగళూరు కంటోన్మెంటు, కేఎస్ఆర్‌ బెంగళూరు, కెంగేరి, మండ్యా స్టేషన్ల మీదుగా మైసూరుకు చేరుకుంటుందన్నారు.


pandu3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2025 | 12:04 PM