AP News: ఆత్మన్యూనత నుంచి.. ఆత్మవిశ్వాసం వైపు...
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:01 PM
పంట సాగులో నష్టపోయిన మహిళలు... పాల ఉత్పత్తిలో చేతులు కలిపారు. లక్షల లీటర్లలో పాలసేకరణ చేస్తున్న మహిళా పాడి సహకార సంఘం నేడు దేశానికే స్ఫూర్తినిస్తోంది. 1.2 లక్షల సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా సంస్థగా గుర్తింపు పొందింది. ఆ విశేషాలే ఇవి...
రాయలసీమలో అన్నీ వర్షాధార పంటలే. అక్కడి రైతులు సాగులో నష్టపోవడం మామూలైపోయింది. ‘ఇలా కాదని, పశు పోషణతో నిలదొక్కుకోవచ్చు’ అనుకున్నారు మహిళా రైతులు. అయితే అక్కడ కూడా సమస్యలు తప్పలేదు. ప్రైవేట్ డెయిరీలకి ఎంత నాణ్యంగా పాలు పోసినా, వాళ్లెంత ఇేస్త అంతే తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ‘శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ వారు అన్నమయ్య(Annamayya) జిల్లాలోని రెడ్డికోటకు వచ్చారు. ‘ఆడవాళ్లే ఉత్పత్తిదారులు... వారే యజమానులు’ అంటూ పాల అమ్మకాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
వారు సేకరించే పాలను వాళ్లే అమ్ముకుని డబ్బులు తీసుకునేలా ఏర్పాటు చేశారు. అలా 27 మందితో మొదలైన సంస్థ దినదినాభివృద్ధి చెంది పాలాభిషేకం చేసే స్థాయికి ఎదిగింది. ఉదాహరణకు శ్రీదేవి ఒక సామాన్య రైతు కూలీ. ఒకప్పుడు పిల్లలను చదివించే స్థోమత లేని ఆమె కూతురు... ఇప్పుడు విదేశాల్లో ఎంఎస్ చేస్తోంది. శ్రీదేవి ‘శ్రీజ’ లో ఫౌండర్ మెంబర్‌గా చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ అదే సంస్థకు ఛైర్మన్ అయ్యారు. మేనేజ్‌మెంట్ బోర్డులోనూ అత్యధికంగా 11 మంది మహిళలే ఉన్నారు. వీరంతా రోజుకి 7.5 లక్షల లీటర్ల పాలను ేసకరిస్తారు. ‘‘మహిళల్ని యజమానులను చేయాలని లీటర్‌కి రూపాయి చొప్పున పెట్టుబడి పెట్టించి మమ్మల్ని షేర్ హోల్డర్స్‌ని చేశారు. 15 రోజులకోసారి మా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎక్కువ పాలు పోసినవారికి ఏటా బోనస్ ఉంటుంది’’ అన్నారు శ్రీదేవి.

తిరుపతి పరిసర గ్రామాల్లోని సామాన్య మహిళల కోసం మొదలైన చిన్న ప్రయత్నమే ‘శ్రీజ మహిళా పాడి సహకార సంఘం’. కానీ నేడు అదే సంఘం స్వయం ఉపాధి, సుస్థిర ఆదాయం, మహిళా సాధికారతకు దిక్సూచి అయింది. అధిక వడ్డీ రుణాలు, పాల ధర తక్కువ, మధ్యవర్తుల ఆధిపత్యం, పశుపోష ణకు సరైన పరిజ్ఞానం లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు చుట్టిముట్టిన సమయంలో... ఒక చిన్న గ్రూపు మహిళలతో 2014లో తిరు పతిలో ఏర్పాటయిన ‘శ్రీజ మహిళా పాడి సహ కార సంఘం’ నేడు దేశానికే స్ఫూర్తినిస్తోంది.
రైతు, డెయిరీ మధ్య అనుసంధానం
ఈ మహిళలు పశువైద్య శాఖ, రైతు సంఘాలు, స్థానిక ఎన్జీఓల సలహాలతో పాడి సహకార సంఘం మొదలుపెట్టారు. సభ్యు లందరికీ పశు పోషణలో శిక్షణ... క్రమబద్ధమైన పాల ేసకరణ... బ్యాంకు రుణాలు, సబ్సిడీలలో సహాయం... రైతుకు డెయిరీకి మధ్య నేరుగా కనెక్షన్... ఈ నాలుగు స్తంభాలపై సంఘం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సంఘంలో చేరిన ప్రతి మహిళదీ ఒక పోరాట గాథే. అయితే సంఘం ఇచ్చిన బలం వారి జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చివేసింది.
‘‘కొవిడ్ మహమ్మారి సమయంలో బెంగళూరులో ఉద్యోగం కోల్పోయాను. తరువాత మా సొంత ప్రాంతం తిరుపతికి వచ్చి 2 ఆవులతో పాడిలోకి అడుగుపెట్టాను. మొదట్లో చాలా సమస్యలు ఎదురైనా...ధైర్యంగా ముందుకు సాగాను. ఇప్పుడు 20 ఆవులను పోషిస్తున్నాను. సంఘానికి అత్యధికంగా పాలు సరఫరా చేసే వారిలో ఒకరిగా, అత్యధికంగా 874 షేర్లు కలిగి ఉన్నాను’’ అంటున్నారు నాగజ్యోతి. ఆమె పాల ఉత్పత్తిని పెంచడానికి మిల్కింగ్ యంత్రాలు, చాప్ కట్టర్లు వంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు.
మార్పు మొదలైందిలా...
గతంలో రోజూ 2 నుంచి 5 లీటర్ల పాలు తీసే సభ్యులు నేడు 10 నుంచి 15 లీటర్లకు ఎదిగారు. ఆదాయం నెలకు రూ. 3 వేల నుంచి 15 వేల వరకు పెరిగింది. కొందరు చిన్న డెయిరీలను ప్రారంభించారు. ఉన్నత చదువులున్నా ఉద్యోగం రాని అమ్మాయిలు పాల ేసకరణ, టెస్టింగ్, అకౌంటింగ్ వంటి పనుల్లో నైపుణ్యం సంపాదించారు. స్ర్తీల ఆర్థిక స్వతంత్రం కుటుంబ గౌరవాన్ని పెంచింది. ‘‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సహకారంతో ‘శ్రీజ’ ఏర్పాటైంది. ఏడాదికి లక్ష రూపాయలు తీసుకుంటున్న మహిళలు 29 వేల మంది ఉన్నారు.
ఈ జర్నీ ఇక్కడితో ఆపకుండా దక్షిణ భారతదేశమంతా విస్తరించి 2 లక్షల సభ్యులను చేరుకొని... రోజుకి 15 లక్షల లీటర్ల పాలు ేసకరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. త్వరలో రోజుకి పది లక్షల లీటర్ల పాలు ేసకరించాలన్నది మా ఆశయం’’ అంటున్నారు సంస్థ సిఈఓ తిమ్మప్ప సూర. ప్రస్తుతం సంస్థలో 1.2 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. వ్యాపార టర్నోవర్ రూ.1200 కోట్లు. ఈ మహిళా పాడిసంఘం ఒక రోల్ మోడల్‌గా మారి, ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సంస్థగా గుర్తింపు పొందింది. అతి సామాన్య మహిళలు... నేడు పాల ఉత్పత్తిలో ఒకరికొకరు అండగా నిలబడి, ఆత్మగౌరవంతో విజయ విహారం చేస్తున్నారు.
- శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News