Home » Andhrajyothy Breaking News
కర్నూలు ఎయిర్‌పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు విమానాశ్రయం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసి, తక్కువ వ్యవధిలోనే దానిని ప్రారంభించామని పేర్కొన్నారు.
గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. నిమజ్జనం ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం.. రాష్ట్ర తెగువకు ఆమె నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
వికారాబాద్ జిల్లాలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని పరిగిలో వినాయక నిమజ్జనంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరేగింపులో నర్సింహులు అనే కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్ - 4 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.