• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి స్పందించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.

 సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి అనిత

సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి అనిత

సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అప్పన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

లోన్ చెల్లించలేక మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య

లోన్ చెల్లించలేక మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బోరబండలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక ఇందిరానగర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గద్దె పవన్ కుమార్ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో-లారీ ఢీ కొనడంతో ముగ్గురు మృతిచెందారు.

నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిమ్స్ వైద్యులు శనివారం కలిశారు. నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేశ్ రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఆ భూములను రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదు: మహేశ్వర్ రెడ్డి

ఆ భూములను రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదు: మహేశ్వర్ రెడ్డి

నాడు ధరణి, నేడు భూభారతి రెండు వ్యవస్థలు ఒక్కటేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్.. మాక్ అసెంబ్లీ‌కి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క

కేసీఆర్.. మాక్ అసెంబ్లీ‌కి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క

బీఆర్ఎస్‌పై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నిర్వహించింది మాక్ అసెంబ్లీ కాదని.. డెమోక్రసీని గులాబీ పార్టీ ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు.

 గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: డీజీపీ

గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: డీజీపీ

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం-అభీమ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి