Home » Andhrajyothy Breaking News
మజ్జి శ్రీనివాసరావు రాకతో టీడీపీకి మరింత బలం చేకూరిందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంత్రిని మంగళవారం మర్యాద పూర్వకంగా మజ్జి శ్రీనివాసరావు కలిశారు.
వెయ్యి రోజుల తర్వాత తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తమపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ దాడులకు తెగబడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలోని చరిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సందర్శించారు. సత్యాగ్రహం జన్మస్థాన సందర్శన ఒక పవిత్ర యాత్ర అని వ్యాఖ్యానించారు.
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో రౌడీషీటర్ నయీమ్‌ను కొంతమంది దుండగులు హత్య చేశారు. వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లోని ఆయుధాలను మాజీ హవల్దార్ మల్లేశ్ చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీ వెనుక అసలు కారణాలపై మల్లేశ్‌ను సమగ్రంగా పోలీసులు ప్రశ్నించనున్నారు.