Home » Andhrajyothy Breaking News
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని.. అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్(X) వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పోస్టు పెట్టారు.
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది . కారు ఢీకొని ఇజాన్ ఉద్దీన్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర విద్యా శాఖ 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ‘ఘన వ్యర్థాల నిర్వహణ’పై జాతీయ స్థాయి క్విజ్ నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌ను ‘స్వచ్ఛతా హి సేవా 2026’ కార్యక్రమంలో ‘భాగంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్’ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తనపై చేసేవి చెత్త ఆరోపణలని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు.
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. ఉద్యోగాలు సంపాదించేందుకు తాము పడిన కష్టాల గురించి పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈ రెండు పార్టీలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ విద్యావ్యవస్థ మారుతుందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యమని.. అందుకే విద్యాశాఖ ఎంచుకున్నానని పేర్కొన్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.