Home » Andhrajyothi
రక్తంలో సోడియం తగ్గడం (హైపోనాట్రీమియా) వృద్ధుల్లో సాధారణ మైన సమస్య. సోడియం శరీరంలో నీటి సమతౌల్యానికి, నాడీ, కండరాల పనితీరుకు అవసరం. ఇది తగ్గిపోతే అలసట, బలహీనత, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు వస్తాయి.
దంతేరస్ వచ్చిందంటే చాలు.. తులమో, అర తులమో బంగారాన్ని కొనుక్కోవడం భారతీయుల సంప్రదాయం. మన పెద్దలు ముందుజాగ్రత్తగా సంస్కృతి సంప్రదాయాల రూపంలో పొదుపు పాఠాలను తరతరాల నుంచీ బోధిస్తూ వస్తున్నారు..
మొన్నటి వరకు వర్షాలు ముంచెత్తాయి. వద్దన్నా ఊరూవాడ తల్లడిల్లేలా చేశాయి. ఇక ఇప్పుడు శీతాకాలం దండయాత్ర చేయడానికి సిద్ధమవుతోంది. చలికాలమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి. కాస్త ప్రణాళిక, ఇంకాస్త ముందుజాగ్రత్త ఉంటే చాలు.. వచ్చే ఆరోగ్య సమస్యల నుంచీ బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అప్పుడే శీతాకాలాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేయవచ్చు...
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు... అయితే... కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి త్వరలో ఫలిస్తుందని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
తెలుగు సినీ సంగీతంలో ‘దూకుడు’ చూపిస్తూ ‘సౌండ్ ఆఫ్ సక్సెస్’గా పేరుతెచ్చుకున్నాడు.. తమన్. ప్రతీ బీట్లో మాస్, ప్రతీ ట్యూన్లో క్లాస్.. అదే ఆయన స్టైల్. ఈ మ్యూజిక్ మాస్ట్రో పుట్టినరోజు నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
అన్ని ఆకుకూరల్లాగానే తోటకూరలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ A, C, K, ఫోలేట్, ఖనిజాలు (ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తహీనత ఎదుర్కొనేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఈ పోషకాలు అత్యవసరం.
మధ్యప్రదేశ్లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’గా మధ్యప్రదేశ్ ప్రసిద్ధి.
సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.
అమ్మాయిలకు అమ్మే ఓ ఫ్యాషన్ ఐకాన్. నేటితరం అమ్మాయిలు అమ్మతో పేగుబంధాన్నే కాకుండా చీరబంధాన్ని, ఆభరణాలబంధాన్ని కూడా చాటుకోవాలని చూస్తున్నారు. అమ్మ పెళ్లినాటి చీర, నగలు దాచుకుని మరీ... సరికొత్త లుక్తో ధరిస్తున్నారు. తమ జీవితాల్లోని ముఖ్యఘట్టాల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మురిసిపోతున్నారు.
బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, అలియాభట్, జాన్వీకపూర్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ జాబితాలో తాజాగా సోనాక్షి సిన్హా వచ్చి చేరింది. సుధీర్బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’తో తెలుగులోకి అడుగుపెట్టిందీ స్టార్కిడ్.