ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది...
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:12 AM
ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. గ్రహస్థితి అనుకూలంగా ఉందని,. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని తెలుపుతున్నారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
అనుగ్రహం
25 - 31 జనవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. చీటికి మాటికి చికాకుపడతారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అన్నింటా మీదే పై చేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయా నికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అందరితో కలుపుగోలుగా మెల గుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిం చండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీ యులు సాయం చేస్తారు. ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యులను కలిసినా ప్రయోజనం ఉండదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
వ్యవహారజయం, కార్యసిద్థి ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందు కేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ముఖ్య మైన వివరాలు వెల్లడించవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. చిన్న విషయానికే చికాకు పడతారు. ఓర్పుతో మెలగండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. మీ కోపతా పాలు అదుపులో ఉంచుకోండి. బంధువర్గంతో విభేదిస్తారు. ఎవరినీ తప్పుపట్టవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదా యం సంతృప్తికరం. ఖర్చులు తగ్గించు కుంటారు. పెట్టుబడుల నిర్ణయం పునఃపరిశీ లించుకోండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకో వద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
వ్యవహారజయం, కార్యసిద్థి ఉన్నాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియ జేయండి. వివాహయత్నం ఫలించే సూచన లున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఆలోచిం పచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరు పుతారు. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. భేషజాలకు పోవద్దు. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి ధనం అందు తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. అను కున్నది సాధిస్తారు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య మైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ సందే హాలను సన్నిహితులకు తెలియజేయండి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వ్యవహారం కొలిక్కివస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుం టారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితుల వుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా యత్నా లు సాగిస్తారు. కుటుంబసౌఖ్యం పొందుతారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశావహదృక్పఽథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పెద్దఖర్చు తగిలే ఆస్కా రం ఉంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దూర ప్రయాణం తలపెడతారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News