ఆకలి లేకపోయినా తింటున్నారా? ఇది ఒక మానసిక సమస్యని తెలుసా?
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:39 AM
ఆహార అలవాట్లు, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉందని మీకు తెలుసా..?. 'ఫుడ్ నాయిస్' అనే మానసిక సమస్య ద్వారా అతిగా తింటారనే విషయం గురించి తెలుసా..? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో వీక్షించండి..
ఆంధ్రజ్యోతి, జనవరి 26: 'ఫుడ్ నాయిస్' (Food Noise) అనేది ఒక మానసిక సమస్య. ఆకలి లేకపోయినా భావోద్వేగాలు, ఒత్తిడి వల్ల లేదా సోషల్ మీడియాలో చూసిన ప్రమోషన్స్ వల్ల నిరంతరం తినాలనే ఆలోచనలు వస్తుంటాయి. దీన్నే ఫుడ్ నాయిస్ అంటారు. ఆకలి లేకుండానే తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అంతేకాదు, ఇది బింజ్ ఈటింగ్ (అతిగా తినడం) లేదా ఈటింగ్ డిసార్డర్‌కు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణాలు తక్కువ నిద్ర, ఎమోషనల్ ఈటింగ్, స్ట్రెస్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్. దీని గురించి ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం..
Updated at - Jan 26 , 2026 | 07:51 AM