Share News

Vantalu: అలనాటి అలసందల కూర..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:37 PM

అలసందలు తిన్న వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా, జీర్ణప్ర క్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వెయ్య నివ్వకుండా పొట్ట దండిగా ఉండటాన ఉదయంపూట షుగరు మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్‌ చాలా అనుకూలం.

Vantalu: అలనాటి అలసందల కూర..

నొసట చుట్టలుచుట్టలుగా తిరుగుతూ జీరాడే ముంగురుల వలయాకారాన్ని సంస్కృ తంలో ‘అల్‌’ అంటారు. సాంద్రత అంటే, దట్టంగా ఉండటం. ‘అల్‌ - సాంద్ర’గా ఉన్న కాయలు అల్సంద కాయలయ్యాయి. మినుము లకన్నా బలకరమైనవిగా ఉండటంతో వీటికి ‘రాజమాష’ అనే గౌరవనామం వచ్చింది.

ఇవి పొడవుగా ఉంటాయి; బొబ్బర్లుమాత్రం చిన్నవిగా ఉంటాయి. నవధాన్యాలలో వీటి గింజలు కూడా ఉన్నాయి. వగరుగా ఉండటం వల్ల షుగరు, స్థూలకాయం నియంత్రణకు ఉపకరిస్తాయి. పురుషుల జీవకణాలను బాలింతల్లో తల్లిపాలను పెంచుతాయి.

అలసందలు తిన్న వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా, జీర్ణప్ర క్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వెయ్య నివ్వకుండా పొట్ట దండిగా ఉండటాన ఉదయంపూట షుగరు మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్‌ చాలా అనుకూలం. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల దేహానికి పుష్టినీ, మనసుకు తుష్టినీ అంటే, సంతోషాన్నీఇస్తాయి.


అలచందల కూర: నలమహారాజు పాక దర్పణంలో అలసందల్ని కూరగా వండుకోవ టాన్ని వివరంగా చెప్పాడు. ఇది రాజభోజనం. అంటే, పోషక విలువల సంపన్నతను పెంపు చేసుకునే ఉపాయం కూడా!

1. అలసందల్ని ముక్కలుగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి పదినిమిషాలు ఉంచి నీటిని వార్చేయాలి.

2. పసుపు, ఇంగువ, ధనియాలపొడి కలిపి, మంచినీళ్లు పోసి ముక్కలు మెత్తబడేదాకా ఉడికించి, నీటిని వార్చేయాలి.

3. కొబ్బరి తురుము, తెల్లనువ్వులు వీటిని పాలతో మెత్తగా నూరి ముద్దగా చేసి, ఈ ముక్కలలో కలపాలి.

4. కొద్దిగా పాలుపోసి, పాలు ఇగిరేదాకా మళ్లీ మృదువుగా ఉడికించి, నెయ్యి వేసి పొయ్యి మీంచి దించేయాలి.


5. కూర చల్లారాక, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు, ఆవాలు, మిరియాల పొడులని చిటికెడంత కలపాలి. నిమ్మముక్కలు, మొగలిరేకులు ఇలాంటి పరిమళాలను కూడా చేర్చి మూతబెట్టి పక్కన ఉంచాలి.

6. తినబోయేముందు నిమ్మ, మొగలి రేకుల్ని తీసేసి, ఈ కూర మొత్తాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి, కాగే నేతిలో ఈ మూటని కాసేపు ఉంచి వడ్డించాలి

ఇది కేవలం వంట విధానం కాదు, రుచి, పరిమళం, జీర్ణశక్తి, పోషణ ఈ నాలుగింటినీ సమన్వయం చేసిన ప్రాచీన రాజస ఆహార శాస్త్రం. వేడివేడిగా అన్నంలో తింటే కమ్మగా, శక్తిదాయకంగా ఉంటుంది. వాతం, కఫం ఎసిడిటీలు కలగకుండా ఉంటాయి.


book7.2.jpg

ఈ కూరని ఇలా 8 అంచెలుగానే చెయ్యాలా? ఉడకబెట్టి తాలింపు పెడితే చాలదా? అనే సందేహం రావచ్చు. మామూలు కూరలోని గుణ దోషాలను సరిచేసి, శక్తి సంపన్నమైనదిగా తయారుచేసుకునే ఉపాయాలు తెలియచెప్పటమే పాకశాస్త్ర ప్రయోజనం.

పచ్చకర్పూరం, ఆవపిండి వీటిని చాలా కొద్దిగా మాత్రమే కలపాలి. ఎక్కువైతే చేదు వస్తుంది. కూర బాగా చల్లారిన తరువాత మాత్రమే వీటిని కలపాలి. పచ్చకర్పూరం పరిమళ భరితమైనదే కాకుండా, కూరలోని పోషకాలు త్వరగా శరీరానికి వంటబట్టేలా చేస్తుంది. ఈ గుణాన్ని యోగవాహి అంటారు. ఆవపిండి, మిరియాల పొడి, కూడా పోషకాలను అవి పనిచేసే అవ యవానికి వేగంగా తీసుకువెళ్ళేందుకు సహక రిస్తాయి. అంతేకాదు, పచ్చకర్పూరంపరిమళం తగలగానే ఆ వంటకం పట్ల మనకు పవిత్ర మైన భావన కలుగుతుంది. అందువలన అది వంటబట్టే తీరు వేరుగా ఉంటుంది. అలాగే, ఆవపిండి స్వల్ప మోతాదులోనే కలిపినా జీర్ణశక్తిని పెంచి, వాతాన్ని పోగొడుతుంది.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book7.3.jpgమునక్కాడల సూప్‌

కావలసిన పదార్థాలు: మునక్కాడలు- మూడు (ముక్కలుగా కోసి పెట్టు కోవాలి), ఎర్ర కందిపప్పు-3 స్పూన్లు, టమాటా-ఒకటి, ఉల్లి ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, మిరియాలు - ఒకటి, లవంగాలు - ఒకటిన్నర, జీలకర్ర - స్పూను, ధనియాలు - స్పూను, ఉప్పు - స్పూను, నీళ్లు - మూడు కప్పులు, కొత్తిమీర - రెండు స్పూన్లు, పుదీనా - రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం: ఓ ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడల ముక్కలు, ఎర్ర కందిపప్పు, టమాటా, ఉల్లి, మిర్చి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, కొత్తిమీర, మిరియాలు, ఉప్పు, మూడు కప్పుల నీళ్లు వేసి మూతపెట్టాలి. ఐదు విజిల్స్‌ తరవాత కట్టేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి రుబ్బాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి గుజ్జునంతా వేరుచేయాలి. అందులో కాస్త నీళ్లని కలిపి ఓ గిన్నెలో వేడిచేయాలి. కొత్తిమీర, పుదీనాను మిక్సీలో విడిగా రుబ్బుకోవాలి. ఈ పుదీనా రుబ్బును ఉడుకుతోన్న ద్రావణంలో కలిపి మరి కాసేపు వేడి చేస్తే, మునక్కాడల సూప్‌ సిద్ధం.


పచ్చి మిరప పచ్చడి

కావలసిన పదార్థాలు: శనగపప్పు - రెండు స్పూన్లు, మినప్పప్పు - రెండు స్పూన్లు, పొడువు పచ్చి మిర్చి- 6, ఎండు మిర్చి- అయిదు, చింతపండు-కాస్త, వెల్లుల్లి రెబ్బలు-ఎనిమిది, కొత్తిమీర - అర కప్పు, మెంతులు పోపు గింజలు - స్పూను, నూనె, ఉప్పు - తగినంత.

book7.4.jpg

తయారుచేసే విధానం: చిన్న బాణలిలో శనగ, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయించి, చల్లారాక మసాలా పొడి చేసిపెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి అందులో వెల్లుల్లి, పొడవు మిర్చి, ఎండు మిర్చిని వేయించాలి. పది నిమిషాల తరవాత కొత్తిమీర, కరివేపాకును జత చేయాలి. అంతా దగ్గరవుతుంటే మసాలా పొడి, చింతపండు, ఉప్పుని కలిపి దించాలి. బాగా చల్లారాక మిక్సీలో తిప్పి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి పోపు పెట్టి అందులోనే ఈ మెత్తటి మిశ్రమాన్ని రెండు నిమిషాలు నూనెలో వేయిస్తే పచ్చి మిర్చి పచ్చడి తయారు. అన్నంలోకి బాగుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 12:45 PM