Home » Andhrajyothi
ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా నలుగురితో కలిసి కాలు కదిపితే... మనసుతో పాటు శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగు తుంది. ఒక లయబద్ధంగా చేసే ‘లైన్ డ్యాన్స్’ మెదడులోని హిప్పోకాంపస్‌ను చురుగ్గా మారుస్తుంది. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ.
‘హూ-రెన్-సో’ అనేది జపనీస్ వర్క్ కల్చర్‌లో ప్రాచుర్యం పొందిన సమాచార సిద్ధాంతం. ఈ ఫార్ములా ఆయా టీమ్‌ల మధ్య నమ్మకం, స్పష్టత, సహకారం పెంచుతూ మేనేజ్మెంట్, ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తోంది. ఒకరకంగా ఇది మోడ్రన్ ఆఫీస్‌కి న్యూ ఏజ్ కమ్యూనికేషన్ మంత్ర.
నమీబియాలోని ‘నమీబి’ ఎడారిలో ‘పింక్ ఫ్రిజ్’ అనేది ఓ టూరిస్టు ప్లేస్. దానిని ఎడారి యాత్రికుల కోసం అక్కడి ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. క్రమం తప్పకుండా అందులో నీళ్ల బాటిళ్లు, ఐస్ టీ, కాఫీ బాటిళ్లు పెడుతుంటారు. ఆ దారిలో వెళ్లే వాళ్లంతా వాటిని తాగొచ్చు ఉచితంగా. పైగా అక్కడ రెండు గులాబీ కుర్చీలు, టేబులూ వేసి ఉంటాయి.
మునుపెన్నడూ లేనంతగా ప్రజల్లో నేడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఏం తిన్నా ఆరోగ్యకరంగానే ఉందా? అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అంతేనా... నగరాల్లో అయితే తక్కువ క్యాలరీలు, జీరో ఫ్యాట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.
నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్ డైరెక్ట్ చేసేవాడిని, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్ అయిపోయాక హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని.
ఒకవైపు తుఫాన్ హెచ్చరికలతో.. పొలాల్లో హార్వెస్టర్లు పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు విరామం లేకుండా కోత కోసేస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాలపై ఆరబెట్టే పనికూడా లేకుండా అన్నదాతలు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండు, మూడు రోజుల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్, పాసివ్ స్మోకర్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి బుధవారం వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు.
కారు తీసుకుని బయటకు వెళితే పార్కింగ్ సమస్య వేధిస్తుంది. కారులో వెళ్లామనే ఆనందం కన్నా... ఎక్కడ పార్కు చేయాలనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరాల్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.
గమ్మత్తేమిటంటే... ఈ 60 ఏళ్ల మాస్టర్‌గారు 1981లో బొటాబొటి మార్కులతో తొలిసారి డిగ్రీ పాసయ్యారు. ఆ మార్కులు చూసి అతడి తల్లి చాలా బాధపడిందట. దాంతో ‘టాప్ మార్కులు తెచ్చుకుంటాన’ని ఆమెకు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఇష్టంతో చదవడం మొదలెట్టాడు.