భారీ దారి దోపిడీ.. రూ.400 కోట్లు ఉన్న కంటైనర్ లారీలు మాయం!

ABN, Publish Date - Jan 27 , 2026 | 07:46 AM

దర్శకుడు మణిరత్నం తీసిన 'దొంగ దొంగ', త్రివిక్రమ్ తీసిన 'జులాయి' సినిమాల తరహాలో నిండా డబ్బున్న రెండు కంటైనర్ లారీలు మిస్ అయ్యాయి. ఆ ట్రక్కుల్లో ఏకంగా రూ. 400 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ వింతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రజ్యోతి, జనవరి 27: కర్ణాటకలోని బెళగావి జిల్లా సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మూడు రాష్ట్రాలు కలిసే ఛోర్లా ఘాట్ (Chorla Ghat) దగ్గర సినిమా తరహా దారి దోపిడీ జరిగింది. రూ.400 కోట్ల విలువైన నగదుతో (బహుశా పాత రూ. 2000 నోట్లు) వెళ్తోన్న రెండు కంటైనర్ ట్రక్కులు హైజాక్ అయ్యాయి! గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా కర్ణాటకలోకి వచ్చి తిరుపతికి వెళ్లాల్సిన ఈ ట్రక్కులు దారి మళ్లించబడ్డాయని అనుమానిస్తున్నారు.

Updated at - Jan 27 , 2026 | 07:49 AM