Home » Andhra Pradesh
నూజివీడులో RGUKT, IBM క్వాంటమ్ నిర్వహించిన IBM-Qiskit Fall Fest -2026కు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కలిశారు. ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణపతకం సాధించిన సురేఖను అభినందించారు.
గడిచిన మూడేళ్లుగా త్వరితగతిన కారుణ్య నియామకాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.
విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఆహ్వానం పలికారు.
కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ఓటు చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికలు రద్దు చేయాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.
అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కన్నతండ్రే బిడ్డను హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆహ్వానించారు.
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి సెజ్ పరిధిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈరోజు ప్రారంభించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టును టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తప్పుబట్టారు. ఫేక్ పోస్టును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ది వైసీపీ కాదని.. గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.