• Home » Ananthapuram

Ananthapuram

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

పోస్టు ఇప్పిస్తానంటూ అక్రమ వసూళ్లకు దిగిన అంగనవాడీ టీచర్‌పై సాక్షాత్తు ఐసీడీఎస్‌ జిల్లా అధికారులే వెనకడుగువేస్తున్నారు. పాతూరులోని ఓ అంగనవాడీ టీచర్‌ ఏకంగా రూ.2.80 లక్షలు వసూలు చేయడంపై బాధితురాలు ఇటీవల ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఐసీడీఎస్‌ అధికారులు ...

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!

కక్కలపల్లి టమోటా మార్కెట్‌..! రైతులు, వ్యాపారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, హమాలీలు, కూలీలు.. ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు. వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలలపాటు కళకళలాడుతుంటుంది. అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్‌లో పైకి కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది మాఫియా గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. వేరే రాషా్ట్రల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి. సొంత వాహనాలున్న టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి. హైవేపై ఓ వాహనంలో ఉండే ముఠా.. రేయింబవళ్లూ రౌడీ మామూళ్ల వసూళ్లను ...

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..

CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15వేల కోట్లు ఇప్పించినట్లు కేంద్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొనే శక్తి చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు.

HOSPITAL : డబ్బు రోగం!

HOSPITAL : డబ్బు రోగం!

అనంత పురం రూరల్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ టీచర్‌ కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సాయినగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి మూడు రోజుల కిందట తీసుకొచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయిని పరీక్షించిన డాక్టర్‌ ఇది డెంగీ ఫీవర్‌లా ఉంది. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయి. ఇక్కడే అడ్మిషన చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ టీచర్‌ ఆందోళనతో డాక్టర్‌ చెప్పినట్లు చేశాడు. ప్రతి రోజూ సగటున రూ.12వేలు వరకు ఫీజు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రూ. 36వేలు వరకు బిల్లు ...

Crime News: ఆరేళ్ల కూతురిని చంపి బావిలో పడేసి.. ఆపై ఏమీ తెలియనట్టుగా..

Crime News: ఆరేళ్ల కూతురిని చంపి బావిలో పడేసి.. ఆపై ఏమీ తెలియనట్టుగా..

నార్పలలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నకూతురిని హత్య చేసి బావిలో పడేశాడో కసాయి తండ్రి. ఆపై ఏమీ ఎరుగనట్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. గణేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పోలీసుల వద్ద అసలు నిజం బయటపెట్టాడు.

Crime News: తాడిపత్రి పాతకోటలో భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త..

Crime News: తాడిపత్రి పాతకోటలో భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త..

అనంతపురం: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసిన ఘటన తాడిపత్రి(Tadipatri) పట్టణం పాతకోట(Pathakota)లో కలకలం రేపింది. తాడిపత్రి పాతకోటలో నివాసం ఉండే దాదా పీర్‌కు రమీజతో ఐదు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని దాదాపీర్ అనుమానించేవాడు. ఈ విషయంపై ఆమెతో తరచూ గొడవపడేవాడు.

AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు

AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు

జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం దేవలచెరువు అడవుల్లో చోటుచేసుకుంది.

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్‌)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)...

Clocktower underpass : ఓటుకు రూటు..!

Clocktower underpass : ఓటుకు రూటు..!

వర్షాకాలం మొదలైంది. పాత భవంతులు, బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ‘అప్రమత్తంగా ఉండండి’ అని అధికారులు హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. ఒక్కోసారి రాకపోకలను నిలిపేసి.. దారి మళ్లిస్తుంటారు. ఇది రొటీన..! కానీ అనంతపురం నగరంలోని కొత్త ఫ్లైఓవర్‌ ‘అండర్‌ పాస్‌’ రాకపోకలను అధికారులు నిషేధించారు. దీన్ని ప్రారంభించి నెల గడిచిందేమో.. అంతే..! అంతలోనే మూసేయడం చర్చనీయాంశం అయ్యింది. ‘ఈ రోడ్డు అండర్‌ బ్రిడ్జి బీఆర్‌71ఏ భద్రత కారణంగా మూసివేయబడింది’ అని ఒక హెచ్చరిక బోర్డు పెట్టారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించడం ఏమిటో.. పోలింగ్‌ పూర్తవ్వగానే మూసేయడం ఏమిటో..! అని నగర ప్రజలు నిట్టూరుస్తున్నారు. ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి