Home » Anantapur urban
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా కలెక్షన్లు నగరంలో రూ.కోటికి చేరుకోవడంపై అభిమానులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.
కుల, విద్యార్థి సంఘాల పేరుతో కొందరు చేస్తున్న వేధింపులు, దందాలపై చర్యలు తీసుకోవాలని నగరంలోని ప్రైవేట్ స్కూళ్ల కరెస్పాండెట్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
మండలంలోని ఆలమూరు రోడ్డులోగల పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల స్టూడెంట్ యాక్టివిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅథితిగా కల్వరీ గ్రేస్ చర్చి పాస్టర్ పాల్ ఆరన హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు.
స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం సాయంత్రం స్వామివారి నగరోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు.
వైసీపీ నాయకులు చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమం ఓ కొత్త నాటకమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. అర్బన నియోజకవర్గంలో 20మందికి 23.87 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటామని ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా ఆస్పత్రి వద్ద శనివారం సీఐటీయూ, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు.
విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థిబ్లాక్ జాతీయ కన్వీనర్ బాలజయవర్దన, పార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీవీసుందరరామరాజు పేర్కొన్నారు. అఖిలభారతవిద్యార్థిబ్లాక్ 3వ రాష్ట్రమహాసభలు బుధవారం వారు నగరంలో నిర్వహించారు.
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎంపీడీవో రవిప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరులో శనివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్ర్‌సగా వైసీపీ మారిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలను విన్నవించేందుకు తరలిరావడంతో వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్) నిర్వహించారు.