CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:41 PM
సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రధాని నరేంద్ర మోదీని శాశ్వతంగా కుర్చీలో కూర్చోపెట్టడానికి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశా రు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని తప్పు పట్టకుం డా వత్తాసు పలకడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉపాధి హామీ కూలీలకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ధా న్యాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కన్నా మన దేశంలో ఉన్న రై తాంగానికి మద్దతు ధర ప్రకటించి ఆదుకుంటే ఇతర దేశాల ధాన్యాన్ని దిగుమతి చేసుకునే దుస్థితి ఉండేది కాదన్నారు. జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, గోపాల్, నరసింహులు, హనుమంతరాయుడు పాల్గొన్నారు.