Share News

Akhanda-2 రూ.కోటి దాటిన అఖండ-2 కలెక్షన్లు

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:11 AM

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా కలెక్షన్లు నగరంలో రూ.కోటికి చేరుకోవడంపై అభిమానులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.

Akhanda-2 రూ.కోటి దాటిన అఖండ-2 కలెక్షన్లు

- సంబరాలు చేసిన అభిమానులు

అనంతపురం క్రైం, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా కలెక్షన్లు నగరంలో రూ.కోటికి చేరుకోవడంపై అభిమానులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.


బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌ మొద్దీన ఆధ్వర్యంలో స్థానిక గౌరీ సినీ కాంప్లెక్స్‌లో సంబరాలు జరిపారు. అభిమానుల నడుమ గౌస్‌ కేక్‌ కట్‌ చేశారు. తర్వాత మాట్లాడుతూ....అఖండ సినిమా విజయవంతంగా దూసుకెళుతోందన్నారు. నగరంలో రూ.కోటి కలెక్షన్లు దాటిందన్నారు. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు శ్రీధర్‌, హరీ్‌షరెడ్డి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 20 , 2025 | 01:11 AM