MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:53 PM
కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆగ్రహం
అనంతపురం క్రైం, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ...సుపరిపాలన కార్యక్రమాన్ని అనంతపురం పార్లమెంట్‌లోనే అర్బన నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. సూపర్ సిక్స్-సూపర్‌హిట్ సభ విజయవంతం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 డివిజన్ల, నాలుగు పంచాయతీల్లో మనమే విజయం సాధించాలన్నారు. నగరంలోని కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే అనంత వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి స్టేషన మీదకుపంపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వీధి రౌడీల్లా పోలీసులపై దూషణలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఎలా దౌర్జన్యం చేస్తారంటూ ఆయన ని లదీశారు. తామే అక్రమ కేసులు పెట్టి ఉంటే ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు ఇలా రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేవారు కాదన్నారు.