Share News

drugs మత్తు పదార్థాల జోలికి వెళ్లకండి

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:08 AM

కుల, విద్యార్థి సంఘాల పేరుతో కొందరు చేస్తున్న వేధింపులు, దందాలపై చర్యలు తీసుకోవాలని నగరంలోని ప్రైవేట్‌ స్కూళ్ల కరెస్పాండెట్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

drugs మత్తు పదార్థాల జోలికి వెళ్లకండి

అనంతపురం విద్య,డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): కుల, విద్యార్థి సంఘాల పేరుతో కొందరు చేస్తున్న వేధింపులు, దందాలపై చర్యలు తీసుకోవాలని నగరంలోని ప్రైవేట్‌ స్కూళ్ల కరెస్పాండెట్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిరుద్యోగులమైన తాము మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ ప్రైవేట్‌ స్కూళ్లను నడుపుకుంటున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పర్మిషన తీసుకొని అనేక ఏళ్లుగా స్కూళ్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కుల, విద్యార్థి సంఘాల పేరుతో కొందరు వచ్చి వివిధ రకాలుగా వేదిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రైవేట్‌స్కూళ్ల అసోషియేషనసంఘం నాయకులు గంగాదర్‌, గోపాల్‌రెడ్డి, రమణారెడి,్డ పోలం రవిచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాఘవేంద్ర, భాస్కరరెడ్డి, విజయ్‌,శ్రీవాత్సవ,నరేంద్ర,వినోద్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 20 , 2025 | 01:08 AM