MLA AMILINENI: క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:39 PM
కంబదూరు మండల కేం ద్రంలోని సీఅండ్‌ఐజీ చ ర్చి కమిటీ సభ్యులు, టీడీ పీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల కేం ద్రంలోని సీఅండ్‌ఐజీ చ ర్చి కమిటీ సభ్యులు, టీడీ పీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే ముందుగా ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎస్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఅండ్‌ఐజీ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్‌కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచదేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, ఇంట్లో కూడా పిల్లలతో కలిసి పండుగ జరుపుకుంటానన్నారు. ఇక్కడి కమ్యూనిటీ భవనానికి అనుమతులు రావాల్సి వుందని, వచ్చే ఏడాది క్రిస్మ్‌సలోగా భవనం పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు.