MLA AMILINENI: రైతులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:58 PM
రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. కంబదూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తమ సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. గత ఏడాది 1,300 మామిడిచెట్లు, డ్రిప్పు, స్ర్పింక్లర్ల పరికాలు పూర్తిగా కాలిపోయి ఆర్థికంగా నష్టపోయాయని వివరించారు. అప్పట్లో అధికారులు తన తోటను పరిశీలించి, నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. తోటను పరిశీలించిన అధికారులు, కంబదూరు మండలం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారన్నారు. అప్పటి నుంచి సమస్యను పట్టించుకోవడం లేదని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌కు ఫోన్లోనే ఆ రైతు సమస్యను వివరించి న్యాయం చేయాలని విన్నవించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైతు సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామినిచ్చారు.