Home » Anantapur urban
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖేలో ఇండియా జాతీయస్థాయి హాకీపోటీల్లో జి ల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. జిల్లా బాలికల జట్టులో శివగంగ, దివ్య, ఇందు, సమీరా, సుమియా, జ్యోతి, అర్చన, సాయిభవ్య, మైథిలి, నవ్య, శృతి, శాలిని, కీర్తన, అక్షయ, వింద్యశ్రీ, సనతాజ్, హర్షిత, మధురిమబాయి, జ్ఞానేశ్వరి ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి జట్టులో సుమియా, శృతి, అర్చన, సమీరా, సనాతాజ్, అక్షయ, అఖిల ఏడుగురు ఉండడం విశేషం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని నెహ్రూ యువకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యువతకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన అవసరమని రెడ్‌క్రాస్ చైర్‌పర్సన భారతి పేర్కొన్నారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో ఆదివా రం ఇండియన రెడ్‌క్రాస్ సొసైటీ ఆఽధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
శ్రీరామనవ మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఏడో రోజున శనివారం బ్రహ్మరథో త్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి, మడుగు తేరు లాగారు. అనంతరం ఆల య ఆవరణలో రథాంగహోమం నిర్వహించారు.
రామేశ్వరం నుండి కాశీ వరకు ఆధ్యాత్మిక పాదయాత్ర చేస్తున్న భక్తులను సన్మా నించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెం కటేశ్వర ప్రసాద్ అన్నారు. కాశీకి 120 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేప ట్టిన తమిళనాడు భక్తులు ఇటీవల జిల్లాలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారికి అవసరమైన భోజనం, వసతి కల్పిస్తున్నారు.
రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యా దవ్‌పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఐ సుధాకర్ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.
మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారీ గురువారం ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత ఆవరణంలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున గురువారం రాములవారు గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సీతారాముల మూలవిరాట్లకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు.