WATER TANK: నిరుపయోగంగా వాటర్ ట్యాంకులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:52 PM
మండల కేంద్రమైన రాప్తాడు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో మినీ వాటర్ ట్యాంకులు నిరుపయో గంగా ఉన్నాయి. ట్యాంకులకు నీరు సరఫరా చేయకపోవడంతో అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు సమీపంలో పండమేటి వెంకటరమణస్వామి ఆలయం సమీపంలో రాప్తా డు, ప్రసన్నాయపల్లి గ్రామ ప్రజలకు దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు.
- నీరున్నా సరఫరా చేయని అధికారులు
రాప్తాడు, ఏప్రిల్ 30 (ఆంద్రజ్యోతి): మండల కేంద్రమైన రాప్తాడు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో మినీ వాటర్ ట్యాంకులు నిరుపయో గంగా ఉన్నాయి. ట్యాంకులకు నీరు సరఫరా చేయకపోవడంతో అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు సమీపంలో పండమేటి వెంకటరమణస్వామి ఆలయం సమీపంలో రాప్తా డు, ప్రసన్నాయపల్లి గ్రామ ప్రజలకు దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ స్థలంలో వారికి ప్రభుత్వం ఇళ్లు కూడా మంజూరు చేసింది. ఆ సమయంలో జగనన్న కాలనీలో తాగునీరు. ఇళ్ల నిర్మాణాల కోసం బోర్లు వేశారు. ప్రజలకు నీటి సౌకర్యార్థం కాలనీలో మెయిన రోడ్డు పక్కన 11 మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పైపు లైను వేసి ట్యాంకులకు కొళాయిలు కూడా అమర్చారు. ట్యాంకుల ఏర్పాటు, పైపులైన కనెక్షన, కొళాయిల కోసం ప్రభుత్వం అప్పట్లో రూ. లక్షల్లో ఖర్చు చేసింది. ప్రస్తుతం ఆ వాటర్ ట్యాంకులకు నీరు సరఫరా కావడం లేదు. కాలనీలో కొంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంకా కొంత మంది నిర్మిస్తున్నారు. మరికొన్ని నిర్మించాల్సి ఉంది. ట్యాంకులకు నీరు సరఫరా చేస్తే నివాసం ఉన్న వారు, ఇళ్లు నిర్మించుకునేవారు ఏ సమయంలోనైనా నీరు ఉపయోగించుకోవచ్చు. ట్యాంకులు ఉన్నా వాటిలో నీరు లేకపోవ డంతో ఇళ్లు నిర్మించుకునేవారు నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. హౌసింగ్, పంచాయతీ అధికారులు స్పందించి జగనన్న కాలనీలో మినీ వాటర్ ట్యాంకులకు నీరు సరఫరా చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై రాప్తాడు హౌసింగ్ ఏఈ లావణ్యను వివరణ కోరగా వాటిని వెంటనే పరిశీలించి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....