CHO: సీహెచఓల నిరసనర్యాలీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:56 PM
ఉద్యోగభద్రత కల్పించాలని, ఎనహెచఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే తమ పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచఓ ల నిరసన జిల్లాలో కొనసాగింది. ఇప్పటికే నిరవధిక సమ్మెకొన సాగిస్తున్నా రు.
అనంతపురంటౌన, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఉద్యోగభద్రత కల్పించాలని, ఎనహెచఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే తమ పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచఓ ల నిరసన జిల్లాలో కొనసాగింది. ఇప్పటికే నిరవధిక సమ్మెకొన సాగిస్తున్నా రు. మూడోరోజు బుధవారం జిల్లాకేంద్రంలో జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి వందలాదిమంది సీహెచఓలు ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, కోర్టురోడ్డు మీదుగా తిరిగి జిల్లా వైద్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ సాయంత్రం వరకు ధర్నా చేశారు. ఏపీ ఎనజీఓ నాయకులు మాధవ్, చంద్రశేఖరరెడ్డి, చంద్రమోహన తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ నిరసనలో సీహెచఓల సంఘం నాయకులు అనూష, గౌరి, రాజేశ్వరి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....