DEVOTIONAL: జయలక్ష్మి మాతకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 01 , 2025 | 12:07 AM
మండలంలోని బొమ్మే పర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీమాత విగ్రహానికి గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీమాత జయంతి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి.
రాప్తాడు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొమ్మే పర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీమాత విగ్రహానికి గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీమాత జయంతి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. భక్తులు అనేక మంది హాజరయ్యారు. బుదవారం అక్షయ తృతీయ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి జయలక్ష్మిమాతకు పలు రకాలు పూజలు చేశారు. భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. గురువారం లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....