Share News

DHARNA: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - May 05 , 2025 | 11:52 PM

మూడు రోజుల్లో మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ హెచ్చరించారు. సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు.

DHARNA: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Municipal workers staging a dharna

- లేకపోతే 8న కార్పొరేషన కార్యాలయం ముట్టడి : సీఐటీయూ

అనంతపురం క్రైం, మే 5(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల్లో మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ హెచ్చరించారు. సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్‌ మాట్లాడు తూ... పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. నగరంలో ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. సకాలంలో కార్మికులందరికీ పనిముట్లు ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కా రం కోరుతూ మంగళ, బుధ వారాల్లోనూ ధర్నా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ 8వ తేదీన కార్పొరేషన కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటారన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌ పావనికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూష ణం, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తిరుమలేష్‌, ముత్తురాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 05 , 2025 | 11:52 PM