Share News

COLONY: వర్షం నీరు వెళ్లేదెలా..!

ABN , Publish Date - May 17 , 2025 | 12:12 AM

కాలనీలోకి వచ్చిన వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక పోవడంతో కురుగుంట వైఎస్సార్‌ కాలనీ వాసు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే వారి అవస్థలు వర్ణతీ తం. రూరల్‌ మండలం కురుగుంట పంచాయతీలోని పాత కురుగుంటతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన యాలేరు, మదిగుబ్బ, కామారుపల్లి ప్రాంతాల పరిధిలోని పొలాల నుంచి పారే వర్షపు నీరు వైఎస్సార్‌ కాలనీ నుంచి సమీపంలోని తడకలేరు లోకి వేళ్లేందుకు చిన్న పాటి వంక ఉంది.

COLONY: వర్షం నీరు వెళ్లేదెలా..!

- వైఎస్సార్‌ కాలనీలో ఇళ్ల మధ్యే నిలుస్తున్న నీరు

- కాలనీ వాసులకు తప్పని అవస్థలు

అనంతపురం రూరల్‌, మే 16(ఆంధ్రజ్యోతి): కాలనీలోకి వచ్చిన వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక పోవడంతో కురుగుంట వైఎస్సార్‌ కాలనీ వాసు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే వారి అవస్థలు వర్ణతీ తం. రూరల్‌ మండలం కురుగుంట పంచాయతీలోని పాత కురుగుంటతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన యాలేరు, మదిగుబ్బ, కామారుపల్లి ప్రాంతాల పరిధిలోని పొలాల నుంచి పారే వర్షపు నీరు వైఎస్సార్‌ కాలనీ నుంచి సమీపంలోని తడకలేరు లోకి వేళ్లేందుకు చిన్న పాటి వంక ఉంది. అయితే కాలనీ సమీపంలో ఓ వెంచర్‌దారులు ఆ వంకను కుదించి ప్రహారీ నిర్మాణం చేపట్టారు. దీనికితోడు చిన్న పాటి రంధ్రం ఏర్పాటు చేసి దాని మధ్యలో మళ్లీ కడ్డీలు ఏర్పాటు చేశారు. దీంతో వర్షం వచ్చిందంటే చాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలనీకి పారిన వర్షపు నీరు వెళ్లేందుకు సమస్యగా మారింది. సవ్యంగా పారేందుకు వీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా ఆ నీరంతా కాలనీలోని ఇళ్ల మధ్య చేరుతోందని కాలనీ వా సులు వాపోతున్నారు. దీంతో నానా అవస్థలు పడుతున్నామని అంటున్నా రు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. ఆరు నెలల కిందట కురిసిన వర్షాలకు ఇళ్ల మధ్యకు, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డామం టున్నారు. ఇప్పుడు మళ్లీ వ ర్షాలు కురుస్తున్నాయని, మ ళ్లీ అవే అవస్థలు పడాల్సి వస్తుందని వారు భయాందో ళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కురి సిన వర్షానికి కొంత వరకు ఇబ్బందులు పడ్డామని, మ రింత జోరువాన కురిస్తే సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదం టున్నారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసు లు కోరుతున్నారు.


మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 17 , 2025 | 12:12 AM