Share News

COLLECTOR: గవర్నర్‌ పర్యటనకు సర్వం సిద్ధం : కలక్టర్‌

ABN , Publish Date - May 17 , 2025 | 12:16 AM

జేఎనటీయూ స్నాతకోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాకు వస్తు న్న రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొ న్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన జేఎన్టీయూ, సూ పర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, రైల్వేస్టేషన, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ గవర్నర్‌ పర్యటించే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు, రైల్వేస్టేషన వీఐపీ లాంజ్‌లో ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

COLLECTOR: గవర్నర్‌ పర్యటనకు సర్వం సిద్ధం : కలక్టర్‌
The collector is inquiring with the registrar Krishnaiah about the venue arrangements

అనంతపురం సెంట్రల్‌, మే 16(ఆంధ్రజ్యోతి): జేఎనటీయూ స్నాతకోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాకు వస్తు న్న రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొ న్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన జేఎన్టీయూ, సూ పర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, రైల్వేస్టేషన, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ గవర్నర్‌ పర్యటించే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు, రైల్వేస్టేషన వీఐపీ లాంజ్‌లో ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైల్వే స్టేషన నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వరకు, అక్కడి నుంచి జేఎన్టీ యూ వరకు కాన్వాయ్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లో సేఫ్‌హౌస్‌ను సిద్ధం చేయాలన్నారు. జేఎన్టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరి యం, ఆలుమ్ని గెస్ట్‌ ఏర్పాట్లపై రిజిస్ర్టార్‌ క్రిష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్‌, మల్లికార్జునుడు, రామ్మోహన, రైల్వేష్టేషన మేనేజర్‌ అశోక్‌ బాబు, డీఎస్సీ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఈ ఆటమయ్య, సీఐలు రాజేంద్రనాథ్‌, వెంకటేష్‌నాయక్‌, శాంతిలాల్‌, వెంకటేష్‌ నాయక్‌, తసీల్దార్లు హరిప్రసాద్‌, బ్రహ్మయ్య, ఏడీఎస్‌ఓ జగన మోహన రావుతోపాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 17 , 2025 | 12:16 AM