MLA: మినీ మహానాడును విజయవంతం చేద్దాం
ABN , Publish Date - May 19 , 2025 | 11:58 PM
తెలుగుదేశం పార్టీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన నియోజకవర్గం మినీ మహానాడును మంగళవారం ఉదయం 10 గంటలకు నగరంలోని కమ్మభవనలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవా రం పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కమ్మభవనలో మినీమహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.
-ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- నేడు కమ్మభవనలో నిర్వహణ
- ఏర్పాట్లపై పరిశీలన
అనంతపురం అర్బన, 19(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన నియోజకవర్గం మినీ మహానాడును మంగళవారం ఉదయం 10 గంటలకు నగరంలోని కమ్మభవనలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవా రం పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కమ్మభవనలో మినీమహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు ఆయన పార్టీ అర్బన కార్యాలయంలో పలువురు ముఖ్యనాయకులతో మినీమహానాడు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపా టి మాట్లాడుతూ... గత రెండేళ్లల్లో మరణించిన వారికి మినీ మహానాడులో సంతాపం తెలపాలని తీ ర్మానించామన్నారు. అనం తపురం అర్బనలో పార్టీ పరంగా భవిష్యతలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మినీ మహానాడు కావడంతో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల నా యకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన బ్యాంక్ చైర్మన జేఎల్ మురళి, మాజీ మేయర్ స్వరూప, నాయకులు ఎద్దు లపల్లి సుబ్రహ్మణ్యం, తలా రి ఆదినారాయణ, బుగ్గ య్య చౌదరి, గాజుల ఆదెన్న, గంగారామ్, కొండవీటి భావన, స్వప్న, సంగా తేజస్విని, రాయల్ మురళీ, సుధాకర్ నాయుడు, సరిపూటి రమణ, కుంచెపు వెంకటేష్, సిమెంట్ పోలన్న, సాలార్ బాషా, సింగవరం రవి, సైఫుద్దీన, ఫిరోజ్ అహ్మద్, ముక్తియార్, చేపల హరి, పరమేశ్వరన, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, నెట్టెం బాలకృష్ణ, మణికంఠబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....