Home » Amaravati
షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ మంగళగిరిలో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారానికి దిగారు.
రాష్ట్రంలో మానవరహిత గస్తీ దళాలుగా డ్రోన్లను వినియోగించనున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లలో ఏడాది పాటు డ్రోన్లతో గస్తీని అమలు చేయాలని మౌలిక సదుపాయాల కల్పనా శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలో భారీ పెట్టుబడికి ప్రముఖ సంస్థ మై హోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడులో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపిన ఈ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకం కింద రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.
వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీ మెయున్ గ్రోత్ ఇంజన్‌గా నిలవాలని కోరుకుంటోందని, ఇందుకు పెట్టుబడిదారులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కోరారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో వర్షాలకు వస్తున్న ప్రవాహాలను సమీపంలోని చెరువులకు మళ్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరద ప్రవాహాలతో రిజర్వాయర్లను, ఇతర నీటి వనరులతో వివిధ చెరువులను నింపాలని సూచించారు.
రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి, హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును సవాలు చేసిన రాజధాని రైతులు ఈ కేసు వేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
‘ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలకు వేదికగా ప్రజా రాజధాని అమరావతి ఉండబోతోంది. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నాం. ఎయిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎల్‌వీపీ వంటి సంస్థలతో అందరూ ఆరోగ్యం కోసం అమరావతికి వస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.