Home » Amaravati
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలను, మెట్రో నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించింది.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది.
దానా తుపాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్ అండ్ డౌన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.
దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై ఈరోజు కేబినెట్లో చర్చించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు.
అమరావతి పునర్నిర్మాణం దిశగా వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది.