Home » Amaravati
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను సూపట్ హిట్ అయ్యేలా చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈనెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో అనంతలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
‘నన్ను కులాంతర వివాహం చేసుకున్న శరత్‌కుమార్.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదు. కలెక్టరేట్ చుట్టూ నాలుగు పర్యాయాలు తిరిగినా న్యాయం జరగలేదు’ అంటూ ఇందు అనే మహిళ గన్నేరుపప్పు (విషపు కాయలు) తిని తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కు వచ్చారు.
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది.
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.
సగానికి తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే.. Tomato Prices Drop by 50 in Madanapalle Market Farmers Face Heavy Losses
‘సార్..! మీకు చేతులెత్తి మొక్కుతాం. మాకు న్యాయం చేయండి. మేం పండించిన పంటలను వ్యాపారులు, దళారులు న్యాయంగా కొనేలా చర్యలు తీసుకోండి’ అంటూ తూనికలు కొలతలు అధికారి శంకర్‌ను మండలంలోని పాల్తూరు రైతులు కోరారు. గ్రామంలో వేరుశనగ తూకాల్లో బాదు పేరిట జరు గుతున్న మోసంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైన విషయం తెలిసింది.
మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ఆశయాలను పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ ముందుకు తీసుకువెళుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవీంద్ర అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు.
వినాయక చవితిని అట్టహాసంగా జరుపుకోవాలని స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజకు అవసరమైన కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనతో పండుగవేళ బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బస్టాండ్‌లలో తిష్ట వేస్తారు. ఆభరణాలతో ప్రయాణించే మహిళలను గుర్తించి.. వారు ఎక్కే బస్సులో ఎక్కేస్తారు. మాటల్లో పెట్టి.. మాయ చేసేస్తారు. సొమ్మంతా కాజేసి మాయమైపోతారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కేంద్రానికి చెందిన నలుగురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి.. చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు.
సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిపై అబద్దపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్చ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో వందల ఏళ్లుగా ప్రజలు నివాసాలు ఉంటున్నారని తెలిపారు. మొన్న వచ్చిన వరదలకే మునిగిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు..