Share News

Minister Narayana: ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగే.. ఫేజ్‌ వైజ్ కాదు..

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:51 AM

రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడి పనులను పరిశీలించారు. 11, 8 జోన్‌లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు మంత్రి తెలిపారు.

Minister Narayana: ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగే.. ఫేజ్‌ వైజ్ కాదు..
Minister Narayana

అమరావతి, డిసెంబర్ 9: అమరావతిలో లే అవుట్ రోడ్‌లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని... అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో డ్రైనేజ్‌లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.


అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామన్నారు. లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లు ఉన్న 11, 8 జోన్ల లో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.


66వేల ఫ్లాట్స్‌లో 7వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్‌లు చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్‌ను రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటున్నారని చెప్పారు. 450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1891 ఫ్లాట్స్‌లో కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నవి ఉన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరత్రా రిజిస్ట్రేషన్‌లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామన్నారు. రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి కోరారు. 11, 8 జోన్‌లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నామని....ఫేజ్ వైజ్ కాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


కాగా.. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ.. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్‌పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. మంతి నారాయణతో పాటు ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు పర్యటనలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

అమెరికా టూర్‌లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు

రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు ఆలయ పోటు కార్మికులు మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 01:40 PM