Tirupati News: తిరుపతిలో ఈట్ స్ట్రీట్.. త్వరలో అందుబాటులోకి..
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:26 PM
తిరుపతిలో ఫుడ్ కోర్ట్‌కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్‌లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.
- జోరుగా సాగుతున్న పనులు
తిరుపతి: తిరుపతి(Tirupati)లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈట్ స్ట్రీట్ (ఫుడ్ కోర్ట్)కు వేగంగా అడుగులు పడుతోంది. ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 8/16 సైజుగల 12 కంటైనర్లను స్టాళ్లుగా మార్చనున్నారు. మిగిలినవి నిర్దేశించిన ఖాళీ స్థలాన్ని స్టాళ్లుగా మార్చుకునేందుకు టెండరుదారుకు కేటాయించనున్నారు. రెండు నెలల్లో పూర్తిచేసి, ఫుడ్ కోర్టు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కపిలతీర్థం రోడ్డు, ఆర్టీసీ బస్టాండు ప్రాంతం, వెస్ట్ చర్చి ప్రాంతాలను పరిశీలించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక కమిషనర్ మౌర్య ఫుడ్ కోర్ట్‌పై ప్రత్యేక చొరవ చూపించారు. దాదాపు రూ.80లక్షలతో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తీసుకుని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఫుడ్ కోర్టులోని స్టాళ్లను టెండర్ల ద్వారా కేటాయించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News