Home » Amaravati
ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతికి చెందిన శానిటేషన్ వర్కర్ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు.
పనపాకం రిజర్వు ఫారెస్ట్ ఫరిధిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాల గుర్తింపులో చిక్కుముడి వీడలేదు. ఇక్కడి అడవిలో రెండు మృతదేహాలను ఆదివారం సాయంత్రం గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన విషయం తెలిసిందే. సీఐ సుదర్శన్ ప్రసాద్, తహసీల్దార్ సంతోష్ సాయి, సిబ్బంది సోమవారం వెళ్లి పరిశీలించారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా జరుగుతోంది. దేశంలోనే అతి కీలమైన నగరంగా నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని నభూతో అన్నట్లుగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్‌తో చకచకా జరుగుతున్న రాజధాని పనులను ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం పరిశీలించి, ప్రశంసించింది.
వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందన్నారు. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
డీఎస్సీ-2025లో అనర్హుల ఏరివేత కొనసాగుతోంది. అదే సమయంలో అర్హులు ఎక్కడున్నా అవకాశం కల్పిస్తున్నారు. డీఎస్సీ రాసిన అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆశలు వదులుకున్నారు. తమ పనుల్లో నిమగ్నమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టడంతో బోగస్‌లు బయటపడ్డారు.