Child Care Leave(CCL): ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైల్డ్ కేర్ లీవ్‌కు వయో పరిమితి ఎత్తివేత
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:45 PM
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు..
అమరావతి, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందించింది. చైల్డ్ కేర్ లీవ్ (CCL) వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నం.70 జారీ చేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు మొత్తం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ ఉద్యోగ విరమణ వరకు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.
పిల్లల వయసు ఎంతైనా సరే, దివ్యాంగ పిల్లల సంరక్షణతో సహా వివిధ అవసరాలకు ఈ సెలవు అందుబాటులో ఉంటుంది. గతంలో పిల్లల వయసు 18 ఏళ్లు (దివ్యాంగులకు 22 ఏళ్లు) దాటితే ఈ సదుపాయం లభ్యం కాదు. ఇప్పుడు ఆ పరిమితి ఎత్తివేతతో మహిళా ఉద్యోగులు పిల్లల అవసరాలు, వైద్య పరీక్షలు, అనారోగ్యం లేదా ఇతర కారణాలు కోసం సర్వీసు ముగిసే వరకు ఈ లీవ్ తీసుకోవచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఉద్యోగుల సంఘాలతో జరిపిన సమావేశంలో ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో మహిళా ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..