Share News

CM Chandrababu: స్పెషల్‌గా 'క్వాంటం టాక్'.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 22 , 2025 | 07:52 PM

క్వాంటం టాక్’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. వేల మంది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో సీఎం ‘క్వాంటం టాక్’లో మాట్లాడనున్నారు.

CM  Chandrababu: స్పెషల్‌గా 'క్వాంటం టాక్'.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
Quantum Technology

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): క్వాంటం టాక్’ కార్యక్రమం రేపు(సోమవారం) జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొననున్నారు. వేలమంది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో సీఎం ‘క్వాంటం టాక్’లో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.


క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఏపీలో తొలిసారి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. ట్రైనింగ్ ప్రోగ్రాంలో 50 వేల మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్వాంటం ప్రోగ్రామ్‌కు 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్‌ మ్యాప్‌ను విద్యార్థులకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు.


క్వాంటం టెక్నాలజీ లక్ష్యాల గురించి సదస్సులో ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రంలో క్వాంటం నైపుణ్యాలను తీర్చిదిద్దేలా క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన మూడువేల మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి ఐబీఎం, టీసీఎస్, సహా సీడాక్‌లలో శిక్షణ అవకాశాలు ఉన్నాయి. ఏపీ నుంచి లక్షలాది మంది క్వాంటం నిపుణులను తయారు చేయటమే లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రామ్ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 07:56 PM