Home » ABN
కోకాపేటలోని భూములకు ఈ వేలం ఈ రోజు కొనసాగింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది.
2009 నవంబర్ 29వ తేదీన నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ దీక్షపై పలువురు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తమను అన్యాయం చేసినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని.. గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
జోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండింటి కలయిక.. బుధాదిత్య యోగాన్ని కల్పిస్తుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో.. గడువు తీరిన 50 మందికిపైగా నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించి.. వారిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో కీలక నిందితులను సై అరెస్ట్ చేసింది.
జ్యోతిబా ఫూలే.. ఈయనను మహాత్మా ఫూలే అని కూడా పిలుస్తారు. గొప్ప విద్యావేత్తగా ప్రసిద్ధిగాంచిన ఫూలే.. భారత దేశంలో మహిళలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్త కూడా. 1827 ఏప్రిల్ 11న జన్మించిన ఈయన.. 1890 నవంబర్ 28న మరణించారు. నేడు ఫూలే వర్ధంతి సందర్భంగా..ఈ ప్రత్యేక కథనం మీకోసం..
గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం దూసుకుపోతోంది. అటు వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేస్తోంది. నేటి మధ్యాహ్నానికి మార్కెట్లో ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...