Share News

'ధురంధర్' పాటకు పాకిస్తాన్ ఆర్మీ సైనికుల డ్యాన్స్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Feb 14 , 2026 | 06:06 PM

పాకిస్తాన్ ఆర్మీ సైనికులు దురంధర్ 'FA9LA'కి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌ థియేటర్లలో రిలీజ్ చేయకుండా నిషేధించినప్పటికీ ఈ పాట అక్కడ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

'ధురంధర్' పాటకు పాకిస్తాన్ ఆర్మీ సైనికుల డ్యాన్స్.. వీడియో వైరల్..
Pakistan Army Dance Video

ఇంటర్నెట్ డెస్క్: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’(Dhurandhar) మూవీని పాకిస్థాన్‌లో నిషేధించారు. ఈ సినిమాలో అరబిక్ పాట 'FA9LA' భారత్ లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బహ్రెయిన్ రాపర్ ఫ్లిప్పరాచి పాడిన ఈ పాట అక్షయ్ ఖన్నాపై చిత్రీకరించారు. ఈ పాట భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్(Pakistan)లో కూడా దుమ్ము రేపుతోంది. ధురంధర్ లోని FA9LA పాటకు ఆర్మీ యూనిఫాం ధరించిన వ్యక్తులు.. డ్యాన్స్ చేస్తున్నట్లు ఒక వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.


ఈ వీడియో @FrontalForce అనే యూజర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ‘పాకిస్థాన్ ఆర్మీ ధురంధర్ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు’ అనే క్యాప్షన్ ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనేదానిపై ఎలాంటి నిర్ధారణ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 07:39 PM