రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.
సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ లాగేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..
ఇవాళ(ఆదివారం) రాంచి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును క్రియేట్ చేసింది.
రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026కి ముందు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఎన్నో ఏళ్లుగా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్ను.. ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు మిచెల్ నేటివెల్తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయి వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్కు సిద్ధమయ్యాయి. మరి రాంచి పిచ్ ఎలా ఉండనుందనే సందేహం మొదలైంది.