బలవంతంగా షాట్లు ఆడకూడదు.. అభిషేక్ శర్మకు సునీల్ గావస్కర్ సలహా
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:41 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ డకౌట్‌గానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో తలపడనుంది. అయితే ప్రస్తుతం అందరి ఆందోళన.. అభిషేక్ శర్మ గురించే! ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడు డకౌట్‌గానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. భారీ అంచనాల భారాన్ని తట్టుకోవడంలో అతడు ఇబ్బంది పడుతున్నాడని సన్నీ అభిప్రాయపడ్డాడు.
‘అభిషేక్ అద్భుతమైన ఆటగాడు. అయితే అంచనాలు అతనిపై భారంగా కనిపిస్తున్నాయి. అమెరికాతో అతడు మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అలా జరగకపోవడంతో అభిషేక్ శర్మపై ఒత్తిడి కనిపిస్తోంది. భారీ షాట్లు ఆడగలిగే అభిషేక్ క్రీజులో కొద్దిసేపు గడపాలి. ఇన్నింగ్స్ మొదటి బంతికే బౌండరీ లేదా సిక్సర్ బాదాలని ప్రయత్నించకూడదు. బౌండరీలు వస్తే ఫర్వాలేదు. కానీ వికెట్లకు అడ్డంగా భారీ షాట్లు ఆడేందుకు తనని తాను బలవంతం చేసుకోకూడదు. సింగిల్ తీసుకుని ఖాతా తెరవొచ్చు. నాలుగు బంతులాడి పరుగులేమీ చేయకపోయినా ఏమీ కాదు. వాటిని తర్వాత భర్తీ చేసుకోవచ్చు. ఒకటి, రెండు ఓవర్లు క్రీజులో గడిపిన తర్వా సహజ శైలిలో ఆడొచ్చు’ అని సన్నీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..
నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు