Share News

ఆసీస్‌ ఆల్‌రౌండ్‌షో

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:55 AM

భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఓపెనర్లు జార్జి యా వాల్‌ (88), బెత్‌ మూనీ (46) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు విశేషంగా రాణించడంతో భారత్‌పై...

ఆసీస్‌ ఆల్‌రౌండ్‌షో

భారత మహిళల ఓటమి

కాన్‌బెరా: భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఓపెనర్లు జార్జి యా వాల్‌ (88), బెత్‌ మూనీ (46) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు విశేషంగా రాణించడంతో భారత్‌పై 19 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సలో ఆతిథ్య జట్టు 1-1తో సమంగా నిలిచింది. నిర్ణాయక ఆఖరి మ్యాచ్‌ శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 163/5 స్కోరు సాధించింది. పేసర్‌ అరుంధతికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 144/9 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36), స్మృతి మంధాన (31), షఫాలీ (29) మాత్రమే రాణించారు. అయితే కేవలం 7 రన్స్‌ తేడాతోనే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌ మూల్యం చెల్లించుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జార్జియా నిలిచింది. మరోవైపు భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కు వ మ్యాచ్‌లు (356) ఆడిన ప్లేయర్‌గా నిలిచి.. సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌, 355)ను అధిగమించింది.

సంక్షిప్త స్కోర్లు:

ఆస్ర్టేలియా: 20 ఓవర్లలో 163/5 (వాల్‌ 88, మూనీ 46; అరుంధతీ రెడ్డి 2/30);

భారత్‌: 20 ఓవర్లలో 144/9 (హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 36, స్మృతీ మంధాన 31, షఫాలీ 29; గార్డ్‌నర్‌ 3/22, గార్త్‌ 2/16, సదర్లాండ్‌ 2/18, మోలినెక్స్‌ 2/37).

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:55 AM