మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్
ABN , Publish Date - Feb 20 , 2026 | 10:06 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై ఆధిపత్యాన్ని చాటింది. గ్రూప్ స్టేజిలో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఓటమిపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై ఆధిపత్యాన్ని చాటింది. గ్రూప్ స్టేజిలో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 2007లో మొదలైన తొలి టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఇప్పటి వరకు పాక్‌తో జరిగిన పోటీల్లో 8-1 ఆధిక్యంలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా టీ20ల్లో ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. భారత్ 14 విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఓటమిపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘1990ల్లో భారత జట్టుకు పాకిస్థాన్‌పై ఓడిపోతామనే భయం ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టీమిండియా మమ్మల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. పాక్ ఎలాగైనా ఓడిపోతుందనే ముద్ర భారత ఆటగాళ్లలో కనపడుతోంది. మా వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు. మాపై గెలిచినా అదొక రొటీన్ విషయంలా చూస్తున్నారు. ఇదే తేడా’ అని ఆమిర్ వ్యాఖ్యానించాడు.
ఈ టోర్నీలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్య వికెట్ సాధించగా, బుమ్రా వరుసగా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీ20ల్లో పాకిస్థాన్‌పై పరుగుల తేడా పరంగా భారత్ సాధించిన అతిపెద్ద గెలుపు ఇదే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
బలవంతంగా షాట్లు ఆడకూడదు.. అభిషేక్ శర్మకు సునీల్ గావస్కర్ సలహా
తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి